బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 19 జనవరి 2021 (17:15 IST)

వైసిపి కుటుంబంలో తగాదాలు మామూలే, సర్దుకుంటాయి: రెవిన్యూ శాఖామంత్రి

వైసిపి కుటుంబంలో తగాదాలు మామూలేనంటూ కొట్టి పారేశారు రెవిన్యూ శాఖామంత్రి ధర్మాన క్రిష్ణప్రసాద్. రోజా నిన్న ప్రివిలేజ్ కమిటీ ముందు కన్నీంటి పర్యంతమవడంపై స్పందించారు రెవిన్యూ శాఖామంత్రి. దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 
 
వైసిపి ఒక కుటుంబమని.. కుటుంబ సభ్యుల మధ్య గొడవ సర్వసాధారణమన్నారు. టీ కప్పులో తుఫాన్ లాగా వైసిపిలో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా వెంటనే తన ఆధీనంలోకి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. 
 
భూకబ్జాదారులపై రెవిన్యూ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోందన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు చేయాల్సిన అవసరం తమకు లేదని.. రాష్ట్రాన్ని అభివృద్థి పథంలో ముఖ్యమంత్రి పరుగులు పెట్టిస్తున్నారని.. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ళపట్టాల పంపిణీ పండుగ లాగా జరుగుతోందన్నారు.