గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (08:19 IST)

బ్యూటీషియన్‌తో లింకు .. సూసైడ్ చేసుకున్న ఎస్ఐ.. ఎక్కడ?

భార్యను కాదని ఓ బ్యూటీషియన్‌తో సహజీవనం చేస్తూ వచ్చిన సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్ఐ) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. గుడివాడ రెండో పట్టణ ఎస్ఐగా పిల్లి విజయ్ కుమార్ పని చేస్తున్నారు. ఈయనకు మూడు నెలల క్రితమే ఆయనకు వివాహమైంది. 
 
అయితే, భార్యను కాపురానికి తీసుకురాకుండా గుడివాడలో ఓ బ్యూటీషియన్‌తో కలిసి ఉంటున్నట్టు తెలుస్తోంది. హనుమాన్ జంక్షన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమె పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమెతోనే ఉంటున్నట్టు చెబుతున్నారు. ఈ విషయం పోలీసు పెద్దలకు తెలిసింది. దీంతో ఆయన్ను మందలించారు. అయినప్పటికీ ఆయన తీరు మార్చుకోలేదు. పైగా, గతంలో ఓ సారి విజయ్‌కుమార్ సస్పెండ్ కూడా అయ్యారు. 
 
ఈ క్రమంలో విజయ్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఫ్లాట్‌లోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, ఆయన ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.