మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 జులై 2015 (18:41 IST)

భూమాకు ఓపెన్ హార్ట్ సర్జరీ, షుగర్, బీపీ ఉన్నాయ్.. దీక్షతో ఏమన్నా అయితే..?

వైకాపా నేత భూమా నాగిరెడ్డి పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన కుమార్తె భూమా అఖిలప్రియ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఉన్న సండ్ర వీరయ్యపై కేసు ఉన్నప్పటికీ ఆయనను రాజమండ్రి ఆసుపత్రికి పంపిన టీడీపీ నేతలు, తన తండ్రి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్న వ్యక్తి, షుగరు, బీపీ ఉన్నాయని చెప్పినా నిమ్స్‌కు తరలించలేదని ఫైర్ అయ్యారు.
 
తన తండ్రి జైలులో నిరాహార దీక్ష చేపట్టారని ఆయనకు ఏదైనా జరిగితే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తాను ఓటేయడానికి వెళ్లినప్పుడు అడ్డుకున్న పోలీసులు, ఓటేశాక వెళ్లిపొమని ఇబ్బంది పెట్టారని... దానిని ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై శాసనసభలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెడతామని చెప్పారు. 
 
భూమా నాగిరెడ్డినే ఇబ్బంది పెడుతున్నాం.. మిగిలిన వారు మాకొక లెక్కా అనే సందేశాన్ని ప్రజల్లో పంపేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నం చేస్తోందని.. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే తన తండ్రి ఇంకా రైజ్ అవుతారే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అఖిల ప్రియ స్పష్టం చేశారు.