అమరావతికి అశోక్ లైలాండ్.. 300 ఎకరాలకు స్థలం ఇచ్చేందుకు ఏపీ సర్కారు రెడీ!
అమరావతి అశోక్ లైలాండ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఇప్పటికే ఐటీసీ సంస్థ తమ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి అమరావతి సమీపంలోని గుంటూరు జిల్లాకు తరలించిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఆటోమొబైల్ దిగ్గజ అశోక్ లేలాండ్ సంస్థ అమరావతిలో ఆటోమొబైల్ పరికరాల సంస్థను నెలకొల్పేందుకు సై అంటోంది.
ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో రాజధానికి అత్యంత సమీపంలో మల్లపల్లి గ్రామంలో అశోక్ లేలాండ్ బాడీ బిల్డింగ్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోందని తెలిసింది. ఈ మేరకు అశోక్ లేలాండ్ సంస్థ ప్రతినిధులకు, ఏపీఐఐసీకి మధ్య డీల్ కుదిరినట్లు తెలిసింది. ఈ డీల్ ఓకే అయితే రూ.1000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన అశోక్ లేలాండ్ సంస్థ ఇందుకోసం 300 ఎకరాలకు పైగా స్థలాన్ని కోరింది.
స్థలంతో పాటు రాయితీలు కూడా ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. రాజధాని ఎదగాలంటే పారిశ్రామికాభివృద్ధి కీలకం కావడంతో భూములతో పాటు అనేక రాయితీలిచ్చి పరిశ్రమల్ని ఆహ్వానించాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. అశోక్ లేలాండ్ మాత్రం ఇతర సంస్థలు కూడా పెట్టుబడులకు అమరావతి వైపు చూస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.