బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 నవంబరు 2024 (10:06 IST)

సజ్జల కుమారుడిపై అట్రాసిటీ కేసు... ఎక్కడ?

sajjala bhargav reddy
గత వైకాపా ప్రభుత్వంలో సకల శాఖామంత్రిగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు, వైకాపా సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఏపీ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కడప జిల్లా పులివెందులలో ఈ కేసు నమోదైంది. ఈ జిల్లాలోని సింహాద్రిపురానికి చెందిన హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్ రెడ్డితో పాటు వైకాపా సోషల్ మీడియా కార్యకలాపాలను నిర్వహించే అర్జున్ రెడ్డి, వర్రా రవీంద్రారెడ్డిలపై పులివెందుల పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు. 
 
జగన్‌ను విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో గత ఐదేళ్లుగా రవీంద్రారెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టిన విషయం తెల్సిందే. దీనిని ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించాడంటూ హరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుతో ముగ్గురిపై అట్రాసిటీ కేసును నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.