మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 3 జులై 2018 (18:36 IST)

కోఠి ప్రభుత్వాసుపత్రిలో పసిపాప కిడ్నాప్- బీదర్‌లో దొరికింది

కోఠి ప్రభుత్వాసుపత్రిలో అపహరణకు గురైన పసికందు ఆచూకీ లభ్యమైంది. జూలై 2వ తేదీ సోమవారం మధ్యాహ్నం కిడ్నాప్ అయిన పసికందు బీదర్‌లో దొరికింది. పసిపాపను కిడ్నాప్ చేసిన మహిళ.. బిడ్డను బీదర్ ప్రభుత్వాసుపత్రి వద

కోఠి ప్రభుత్వాసుపత్రిలో అపహరణకు గురైన పసికందు ఆచూకీ లభ్యమైంది. జూలై 2వ తేదీ సోమవారం మధ్యాహ్నం కిడ్నాప్ అయిన పసికందు బీదర్‌లో దొరికింది. పసిపాపను కిడ్నాప్ చేసిన మహిళ.. బిడ్డను బీదర్ ప్రభుత్వాసుపత్రి వద్ద వదిలిపెట్టి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా పసికందును ఎత్తుకెళ్లిన మహిళ బీదర్ వెళ్లినట్లు గుర్తించారు. 
 
మూడు ప్రత్యేక పోలీస్ బృందాలు బీదర్ వెళ్లాయి. అక్కడ బస్టాండ్, ఆటోవాలాలను విచారించారు. బస్ డ్రైవర్, కండెక్టర్ ఇచ్చిన ఆచూకీ ఆధారంగా ఆ మహిళ బీదర్‌లో దిగిన ప్రాంతం నుంచి ఎంక్వయిరీ మొదలుపెట్టారు. బీదర్ పోలీసుల సాయంతో అణువణువూ గాలింపు చేపట్టారు. అయితే కిడ్నాపర్లు అలెర్ట్ కావడంతో పాటు పసికందును బీదర్ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర వదిలి వెళ్లిపోయారు. 
 
ఏడుస్తున్న పాపను గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది విచారణ చేస్తే.. ఆస్పత్రిలో ఎవరికీ సంబంధం లేదని తేలిసింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం హైదరాబాదు పోలీసులకు తెలిసింది. 
 
వారు ఆస్పత్రి దగ్గరకు వచ్చి.. పాపను గుర్తించారు. హైదరాబాద్‌లో కిడ్నాప్ అయిన చిన్నారిగా నిర్ధారించారు. ఆ వెంటనే బీదర్ పోలీసులు.. హైదరాబాద్ పోలీసులకు ఆ పాపను అందించారు. మంగళవారం రాత్రి ఆ పాప హైదరాబాదు చేరుకుంటుందని పోలీసులు వెల్లడించారు.