శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 1 జులై 2018 (11:51 IST)

నేను గర్భంతో వున్నాను.. ఇక మీ మాటలు ఆపండి: సానియా మీర్జా

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నెటిజన్లపై మండిపడింది. సానియాకు ట్విట్టర్లో ఓ అభిమాని చేసిన కామెంట్ కోపం తెప్పించింది. ప్రస్తుతం గర్భిణీగా వున్నానని.. సోషల్ మీడియాల

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నెటిజన్లపై మండిపడింది. సానియాకు ట్విట్టర్లో ఓ అభిమాని చేసిన కామెంట్ కోపం తెప్పించింది. ప్రస్తుతం గర్భిణీగా వున్నానని.. సోషల్ మీడియాలో ఓ ఫోటోను సానియా పోస్టు చేసింది. ఈ ఫోటోకు అభిమాని కామెంట్ చేస్తూ.. సానియాకు కుమారుడు పుట్టాలని మనస్ఫూర్తి వేడుకుంటున్నట్లు తెలిపాడు. 
 
అతడి కామెంటుకు సానియా మీర్జా స్పందిస్తూ... తాను ఇప్పుడు గర్భిణినని, కొంతమందిని కలిసినప్పుడు ఇదేవిధంగా బాబు పుట్టాలని కోరుకుంటున్నామని చెప్తున్నారని వెల్లడించింది. కానీ ఇలా ఆలోచించేవారికి తానొక విన్నపం చేస్తున్నానని.. ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడకండని ఫైర్ అయ్యింది. ఒకవేళ తన కోసం ఎవరైనా ప్రార్థన చేసేటట్లైతే.. తనకు బాబుకు బదులు అమ్మాయి పుట్టాలని కోరుకోండని తెలిపింది.
 
బాబే పుట్టాలని ఎందుకు కోరుకుంటారని ప్రశ్నించింది. అమ్మాయి పుడితే ఏమౌతుందని అడిగింది. అవగాహన లేనివారు ఇలానే ఆలోచిస్తారని నెటిజన్లపై సానియా మీర్జా మండిపడింది.