శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 2 జులై 2018 (17:36 IST)

కొణిదెల స్టూడియో కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్... 2022 నాటికి పూర్తి?

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తన ఫ్యామిలీ కంటూ ఓ సొంత ఫిల్మ్ స్టూడియోను నిర్మించాలనుకుంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించినా.. ఓ సొంత ఫిల్మ్ స్టూడియోను నిర్మిం

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తన ఫ్యామిలీ కంటూ ఓ సొంత ఫిల్మ్ స్టూడియోను నిర్మించాలనుకుంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించినా.. ఓ సొంత ఫిల్మ్ స్టూడియోను నిర్మించలేకపోయారు.


అయితే ఆయన దశాబ్ధాల కలను ప్రస్తుతం ఆయన తనయుడు చెర్రీ నెరవేర్చబోతున్నాడని సమాచారం. ఇప్పటికే ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు కొణిదెల ప్రొడక్షన్స్‌ను స్థాపించి భారీ సినిమాలను చెర్రీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ప్రస్తుతం ఇదే బ్యానర్‌లో భారీ బడ్జెట్ మూవీ సైరా నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ శివారులో భారీ సెట్‌ను వేశారు. 22 ఎకరాల్లో ఉన్న ఈ భారీ సెట్ స్థలంలోనే ఓ మెగా ఫిల్మ్ స్టూడియో నిర్మించాలని చరణ్ భావిస్తున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
సైరా షూటింగ్ పూర్తయిన తర్వాత చిరంజీవి చేతుల మీదుగా కొణిదెల స్టూడియోస్ భూమిపూజ జరుగబోతోందని.. 2022 నాటికి ఈ స్టూడియో సిద్ధమయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం చెర్రీ కోట్లాది రూపాయలు వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే కనుక జరిగితే చిరంజీవి చిరకాల కోరిక నెరవేరినట్టేనని మెగా ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా వున్నారు.