మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : సోమవారం, 25 జూన్ 2018 (16:54 IST)

సైరా-చిరంజీవికి రెండో భార్యగా హ్యూమా ఖురేషి..?

సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తర్వాత హ్యూమా ఖురేషికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తెలుగు, తమిళంలో ఈ సినిమా విడుదల కావడంత

సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తర్వాత హ్యూమా ఖురేషికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తెలుగు, తమిళంలో ఈ సినిమా విడుదల కావడంతో.. నటనా పరంగా హ్యూమా మంచి మార్కులు కొట్టేసింది. ఫలితంగా తెలుగు దర్శక నిర్మాతల దృష్టి హ్యూమా ఖురేషిపై పడింది. 
 
హ్యూమాను తమ సినిమాల్లో నటింపజేసేందుకు నిర్మాతలు, దర్శకులు పోటీపడుతున్నారు. ఇందులో భాగంగా హ్యూమాకు బంపర్ ఆఫర్ తలుపు తట్టింది. మెగాస్టార్ చిరంజీవి నటించే ''సైరా''లో హ్యూమాకు నటించే అవకాశం వచ్చిందట. ఇందుకోసం సైరా టీమ్ ఆమెను సంప్రదించారట. మెగాస్టార్ ఆఫర్ రావడంతో హ్యూమా కూడా సైరాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 
 
నరసింహారెడ్డి మొదటి భార్య పాత్రలో నయనతార నటిస్తుండగా.. మరో భార్య పాత్ర కోసం హ్యుమా ఖురేషీని తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా త్వరలోనే హ్యూమా ఖురేషి సైరా షూటింగ్‌లో పాల్గొంటుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.