ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 28 జూన్ 2018 (14:02 IST)

సైరా నరసింహారెడ్డి.. రాత్రి పోరాటం.. రూ.40 కోట్ల ఖర్చు.. ఎందుకు?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఉయ్యాలవాడ నరసి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే స్వాతంత్ర్య సమరయోధుడి కథ ఇది. 200 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను చరణ్ నిర్మిస్తున్నాడు.
 
తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో జరుగుతోంది. నరసింహారెడ్డికి .. ఆంగ్లేయులకు మధ్య రాత్రివేళలో జరిగే పోరాట సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. నరసింహారెడ్డిని వీరోచిత నాయకుడిగా ఆవిష్కరించే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్‌లో హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో హాలీవుడ్ ఫైటర్స్ పాల్గొంటున్నారు. 
 
ఈ కారణంగా ఈ ఒక్క షెడ్యూల్ కోసమే రూ. 40కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. యుద్ధ సన్నివేశాలను తెల్లవారు జాము 3 గంటలవరకు కూడా కొనసాగిస్తున్నారట. అయినప్పటికీ చిరు చాలా ఎనర్జిటిక్‌గా షూటింగ్‌లో పాల్గొంటున్నారట. ఇక నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయనున్నారు. 
 
మరోవైపు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్, జగపతిబాబు, సుధీప్ లాంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ సినిమా హక్కుల కోసం భారీ పోటీ నెలకొందట. ఇప్పటికే రెండు మూడు సంస్థలు ఈ హక్కుల కోసం పోటీపడుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి క్రియేషన్స్ భారీ రేటుకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులను తీసుకునేందుకు సిద్ధమైందని టాక్ వస్తోంది.