శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 2 జులై 2018 (08:46 IST)

సోమవారం (02-07-2018) - మెుండి ధైర్యంతో ముందుకు...

మేషం: పుణ్యక్షేత్రాలు, నూతన ప్రదేశాల సందర్శనలకు ప్రణాళికలు రూపొందిస్తారు. రాబడికి మించిన ఖర్చులు అధికమవుతాయి. కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం పొంది, వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధించ గలుగుతారు

మేషం: పుణ్యక్షేత్రాలు, నూతన ప్రదేశాల సందర్శనలకు ప్రణాళికలు రూపొందిస్తారు. రాబడికి మించిన ఖర్చులు అధికమవుతాయి. కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం పొంది, వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధించ గలుగుతారు. ప్రతి విషయానికి ఇతరులపై ఆధారపడే మీ ధోరణి మార్చుకోవడం శ్రేయస్కరం. 
 
వృషభం: బీమా ఏజెంట్లకు, స్థలాల బ్రోకర్లకు చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు అధికారుల నుండి మెప్పు పొందుతారు. ప్రేమవ్యవహారాలు పెళ్ళికి దారితీయవచ్చును. ఆస్తి వ్యవహారాల్లో పెద్దల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. మెడికల్, శాస్త్ర, వాణిజ్య రంగాల వారికి శుభదాయకం. స్త్రీలకు ఆత్మీయుల కలయిక సంతృప్తినిస్తుంది.
 
మిధునం: ప్రింటింగ్ రంగాలవారికి కొత్త పనులు చేపట్టే విషయంలో పోటీ అధికమవుతుంది. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. రావలసిన ధనం అందుతుంది. ప్రేమాను బంధాలు, ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మరింత బలపడతాయి. మీ సంతానం కోసం నూతన పథకాలు రూపొందిస్తారు.  
 
కర్కాటకం: విద్యార్థులకు నూతన పరిచయాలేర్పడతాయి. ఉపాధ్యాయులు అధిక శ్రమ ఒత్తిడికి గురౌతారు. మీ యత్నాలకు సన్నిహితులు సహకరిస్తారు. ప్రైవేటు విద్యా సంస్థల వారికి పోటీ పెరుగుతుంది. స్త్రీలతో మితంగా సంభాషించండి. మీ ప్రత్యర్థుల ఎత్తుగడలను దీటుగా ఎదుర్కుంటారు. సిమెంట్, ఐరన్ రంగాల్లో వారికి పురోభివృద్ధి.  
 
సింహం: ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చుతప్పులు పడుట వలన మాటపడక తప్పదు. ఉద్యోగస్తులు సన్నిహితులతో కలసి సభ, సమావేశాలలో పాల్గొంటారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఆకస్మిక నిర్ణయాలు మంచిది కాదు. మెుండి బాకీల వసూళ్లు వంటి శుభ సంకేతాలున్నాయి.
 
కన్య: కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ముఖ్యం. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది. మీ కళత్ర మెుండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. స్త్రీలు ఆహార వ్యవహారాలలో ఏకాగ్రత వహించండి. చిన్నతరహా, చిరువృత్తుల వారికి సరైన తృప్తి లభిస్తుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సామాన్యంగా ఉంటుంది. 
 
తుల: బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. కోర్టు వ్యవహారాలలో చికాకులు తప్పవు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు తోటివారితో సమావేశాలలో పాల్గొంటారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి.
 
వృశ్చికం: ఆడిటర్లకు పని ఒత్తిడి, ప్లీడర్లకు నిరుత్సాహం తప్పదు. మిత్రులను కలుసుకుంటారు. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. సోదరీసోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. ఎల్.ఐ.సి పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. 
 
ధనస్సు: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. సాంఘిక, దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. 
 
మకరం: అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు. విద్యార్థులకు టెక్నికల్, మెడికల్ వంటి కోర్స్‌లలో అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు తోటివారితో సమావేశాలలో పాల్గొంటారు. విద్యార్థులు ఇతురుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. రాజకీయాలలో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి.
 
కుంభం: కార్యసాధనలో ఆత్మవిశ్వాసం, మెుండి ధైర్యంతో ముందుకు సాగండి. ద్విచక్ర వాహనంపై ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. తలపెట్టిన పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. కాంట్రాక్టర్లకు అనుకోని సదవకాశాలు లభిస్తాయి. రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానరాగలదు.
 
మీనం: విదేశాలల్లోని ఆత్మీయులకు ప్రియమైన వస్తుసామాగ్రి అందజేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. వాహన చోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేవారు అధికంగా ఉన్నారని గమనించండి. సంఘంలో మీ స్థాయి పెరుగును. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది.