సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : ఆదివారం, 1 జులై 2018 (09:18 IST)

01-07-2018 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు?

మేషం: ఆర్థిక విషయాలలో పురోభివృద్ధి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు రాకుండా చూసుకోండి. ప్రయాణాలు అనుకూలం. ఆకస్మిక నిర్ణయాలు మంచిది కాదు. మెుండి బాకీల వసూళ్లు వంటి శుభ సంకేతాలున్నాయి. చిన్నతరహా, చిరువృ

మేషం: ఆర్థిక విషయాలలో పురోభివృద్ధి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు రాకుండా చూసుకోండి. ప్రయాణాలు అనుకూలం. ఆకస్మిక నిర్ణయాలు మంచిది కాదు. మెుండి బాకీల వసూళ్లు వంటి శుభ సంకేతాలున్నాయి. చిన్నతరహా, చిరువృత్తుల వారికి సరైన తృప్తి లభిస్తుంది. విదేశీయానం అనుకూలిస్తుంది. 
 
వృషభం: దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ మంచి తనమే మీకు శ్రీరామరక్ష. క్లిష్ట సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి. స్త్రీలు షాపింగ్‌లో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
 
మిధునం: మందులు, కిరణా, ఫ్యాన్సీ, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిగిరాగలదు. స్థిరచరాస్తుల వ్యవహారాలు, మీ పాత సమస్యలు త్వరలోనే ఒక కొలిక్కి వస్తాయి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. సోదరీసోదరులతో ఏకీభవించలేకపోతారు. 
 
కర్కాటకం: ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి చికాకులు తప్పువు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ సంతానం విద్య, వివాహ విషయాలపట్ల శ్రద్ధ వహిస్తారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం.
 
సింహం: గృహంలో మార్పులు చేర్పులు వాయిదా పడుతాయి. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. తలకు మించిన బాధ్యతలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్త వహించండి. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
 
కన్య: ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా సాగుతాయి. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. ఆకస్మిక ప్రయాణాలు అనుకూలం. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహారాలలో పునరాలోచన అవసరం. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసివస్తాయి. 
 
తుల: సన్నిహితులతో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. బంధువుల రాకతో గృహంలో సందడి చోటు చేసుకుంటుంది. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. దైవ కార్యక్రమాలలో చికాకులను ఎదుర్కుంటారు.
 
వృశ్చికం: ఆర్థిక పరిస్థితి అనుకున్నంత సంతృప్తికరంగా ఉండదు. ఆలయాలను సందర్శిస్తారు. వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు లేక పోవడంతో ఆందోళనకు గురవుతారు. హోటల్, తినుబండా వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. 
 
ధనస్సు: కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. మీ కుటుంబీకులకు ప్రతి విషయం తెలియజేయడం మంచిది. తలకు మించిన బాధ్యతలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్త వహించండి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహారాలలో పునరాలోచన అవసరం.  
 
మకరం: ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. మీ అజాగ్రత్త వలన గృహంలో విలువైన వస్తువును చేజార్చుకుంటారు. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. రహస్య విరోధులు అధికం కావడం వలన రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. 
 
కుంభం: సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. తలపెట్టిన పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్త ఆస్కారం ఉంది. మెళకువ వహించండి.
 
మీనం: ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. బంధుమిత్రుల రాకతో నూతన ఉత్సాహం కానవస్తుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి.