గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (08:24 IST)

దుర్గమ్మ సేవలో బాలయ్య - ఇంద్రకీలాద్రిలో బోయపాటితో కలిసి పూజలు

సినీ హీరో యువరత్న బాలకృష్ణ బుధవారం దుర్గామాతను దర్శించుకున్నారు. చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ఇంద్రకీలాద్రికి వచ్చిన ఆయన ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బాలయ్య, బోయపాటిలకు ఆలయ మర్యాదలతో దుర్గగుడి అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా బాలకృష్ణ, బోయపాటి శ్రీనులకు అమ్మవారి చిత్రపటంతో పాటు వేద ఆశీర్వచనం అందించారు. కాగా, ఇటీవల బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన "అఖండ" చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ సినిమా ఈ నెల 2వ తేదీన విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సూపర్ టాక్‌తో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
ఈ చిత్రం విజయంపై బాలకృష్ణ మాట్లాడుతూ, ప్రేక్షకులు ఎల్లవేళలా మంచి సినిమాలకు బ్రహ్మరథం పడుతారని మరోమారు నిరూపితమైందన్నారు. ఈ చిత్రాన్ని ఇంత విజయవంతం చేసిన దాన్ని నిరూపించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు.