శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (17:59 IST)

బండారు దత్తాత్రేయకు ఉద్వాసన! : తమిళనాడు గవర్నర్‌గా ఛాన్స్?

కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలుకనున్నారు. అదేసమయంలో ఆయనకు తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా నియమించనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తు

కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలుకనున్నారు. అదేసమయంలో ఆయనకు తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా నియమించనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర తాత్కాలిక గవర్నర్‌గా మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీహెచ్. విద్యాసాగర్ రావు వ్యవహరిస్తున్నారు. 
 
కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారు. ఇందులోభాగంగా, పలువురు కేంద్ర మంత్రులు తమ మంత్రిపదవులకు రాజీనామా చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో బండారు దత్తాత్రేయకు కూడా ఉద్వాసన పలకనున్నారు. దత్తన్నను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలిపించుకుని మాట్లాడారు. ఈ భేటీలో ఈ విషయాన్ని దత్తాత్రేయకు అమిత్ షా స్పష్టం చేశారు. భేటీ అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ, తనకు గవర్నర్ పదవిని ఇస్తామంటూ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. 
 
ఆదివారం ఉదయం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పలువురికి మంత్రివర్గంలో కొత్తగా స్థానం లభించనుంది. మరోవైపు, అధిష్టానం సూచనల మేరకు ఇప్పటికే పలువురు తమ పదవులకు రాజీనామా చేశారు. 
 
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు ద‌త్తాత్రేయ రాజీనామాకు సిద్ధ‌ప‌డ్డారు. పార్టీ అవ‌స‌రాల కోసం ప‌నిచేస్తాన‌ని బీజేపీ అధిష్టానానికి చెప్పారు. ఇప్ప‌టికే ప‌లుసార్లు బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షాతో భేటీ అయిన ఆయ‌న... ఈ రోజు రాజీనామా చేస్తార‌ని తెలుస్తోంది.