భవన నిర్మాణ పనుల్లేవ్... మేం పచ్చగడ్డి తినాలా? కార్మికుల ఆగ్రహం
విజయవాడ : మీ మానాన మీరు పెద్ద నోట్లను రద్దు చేసేశారు. ఇపుడు భవన నిర్మాణ పనులన్నీ కుంటుబడిపోయాయి. కూలీ ఇచ్చే నాధుడు లేడు. పనులు లేవు... ఇక మేం ఏం తిని బతకాలి? పచ్చగడ్డా అంటూ భవన నిర్మాణ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ : మీ మానాన మీరు పెద్ద నోట్లను రద్దు చేసేశారు. ఇపుడు భవన నిర్మాణ పనులన్నీ కుంటుబడిపోయాయి. కూలీ ఇచ్చే నాధుడు లేడు. పనులు లేవు... ఇక మేం ఏం తిని బతకాలి? పచ్చగడ్డా అంటూ భవన నిర్మాణ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.500, 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటంతో చిల్లర సమస్య ఏర్పడి తామెంతో ఇబ్బందులు పడుతున్నామని విజయవాడలోని సింగ్ నగర్ ఏరియా భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు.
కేంద్రం నిర్ణయంతో తాము ఉపాధి కోల్పోయామని, పనికి వెళ్ళినా యజమాని రూ.500 ఇస్తుంటే చిల్లర దొరకక నానా ఇబ్బందులు పడుతున్నామని ధర్నాకు దిగారు. ఉపాధి పోయిందంటూ ప్లేట్లలో గడ్డి, చెట్ల ఆకులు పెట్టుకుని తింటూ వినూత్నంగా నిరసన తెలిపారు. నల్ల కుబేరులు బాగానే ఉన్నారని, తాము మాత్రం పనులు లేక పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.