శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 జులై 2019 (16:33 IST)

కోడెల కుమార్తెకు హైకోర్టులో ఊరట...

ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ కుమార్తె విజయలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. నరసరావు పేటలో నమోదైన, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో, విజయలక్ష్మిని అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ తర్వాత ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసింది. విజయలక్ష్మి తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, అదేవిధంగా చంపేస్తామని బెదిరించారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
 
అలాగే, గత టీడీపీ హయాంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక అరాచకాలకు పాల్పడ్డారంటూ పలువురు మీడియా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే విజయలక్ష్మిపై అట్రాసిటీ కేసు నమోదైంది.