శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 16 జనవరి 2021 (19:20 IST)

ముద్రగడ పద్మనాభంకు బీజేపీ గాలం!

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు శనివారం కలిశారు. సోమువీర్రాజు అధ్యక్షుడి హోదాలో ముద్రగడను రెండోసారి కలిశారు.

ఇప్పటికే బిజెపిలో చేరాలని ముద్రగడను సోము వీర్రాజు ఆహ్వానిస్తున్న విషయం విధితమే. ఈ సందర్భంగా వీరి భేటీ కీలకమైంది. తాము అధికారంలోకి వస్తే కాపులకు బిసి రిజర్వేషన్‌ అమలు చేస్తామని బిజెపి ఇప్పటికే ప్రకటించింది.

దీనిని బట్టి చూస్తుంటే ఎపిలో బలోపేతమవడానికి బిజెపి మాస్టర్‌ప్లాన్‌తో ముందుకెళ్తోందని తెలుస్తోంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల్లో అసంతృప్తి నేతలను, మాజీలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.