బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 26 డిశెంబరు 2020 (13:26 IST)

తిరుపతిలో రైతు కాళ్ళు పట్టుకున్న బిజెపి జాతీయ కార్యదర్సి.. ఎందుకు?

రైతులకు పాదాభివందనం చేశారు బిజెపి జాతీయ కార్యదర్సి సునీల్ థియోదర్. రైతులను ఇబ్బంది పెట్టడం కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం కాదన్న సునీల్ థియోదర్..ఇప్పటికైనా నూతన రైతు చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. 
 
పట్టెడన్నం పెట్టే రైతన్న దేవుడితో సమానమని.. ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులు ఇప్పటికైనా మానుకోవాలన్నారు. తిరుపతిలోని కట్టకింద ఊరులో జరిగిన భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకల్లో పాల్గొన్న సునీల్ థియోదర్ వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 
 
నూతన వ్యవసాయ రైతు చట్టాలపై అవగాహన కల్పిస్తూ రైతులకు కరపత్రాలను అందజేశారు సునీల్ థియోదర్. చట్టాలు ఏ విధంగా రైతులకు ఉపయోగపడతాయో తెలుసుకోకుండా కొంతమంది కావాలనే రాద్దాంతం చేస్తున్నారన్నారు. దేశంలో రెండు రాష్ట్రాల రైతులే అనవసరంగా ఢిల్లీ వీధుల్లో నిరసనలు తెలుపుతున్నారన్నారు.