1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2017 (09:29 IST)

తెలుగు లోగిళ్ళలో భోగి సంబరాలు.. భోగిమంటల్లో పడిన వ్యక్తి... కాపాడిన ఎమ్మెల్యే మోదుగుల

తెలుగు లోగిళ్ళలో భోగి సంబరాలు మొదలయ్యాయి. లోగిళ్లలో భోగి మంటలు వేసి చలిని పారదోలారు. ఆ భోగి నీళ్ళతో తలస్నానమాచరించారు. మహిళలు వాకిళ్లను అందమైన రంగవల్లులతో అలంకరించారు. చిన్నారులు కేరింతలతో భోగి మంటల మ

తెలుగు లోగిళ్ళలో భోగి సంబరాలు మొదలయ్యాయి. లోగిళ్లలో భోగి మంటలు వేసి చలిని పారదోలారు. ఆ భోగి నీళ్ళతో తలస్నానమాచరించారు. మహిళలు వాకిళ్లను అందమైన రంగవల్లులతో అలంకరించారు. చిన్నారులు కేరింతలతో భోగి మంటల ముందు కూర్చుని నెల రోజులుగా సేకరించిన వస్తువులతో భారీ మంటలు వేశారు. ఏపీలో జరుగుతున్న వేడుకల్లో పలు ప్రాంతాల్లో మంత్రులు సైతం పాల్గొన్నారు. తెలంగాణలో సంబరాలు మిన్నంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పతంగులతో మిద్దెలపైకి చేరుకుంటున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.
 
మరోవైపు... భోగి మంటల వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమానికి పెద్ద ఎత్తున నేతలు, ప్రజలు తరలివచ్చారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడటంతో, ప్రమాదవశాత్తు ఓ వ్యక్తికి మంటలందుకున్నాయి. పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి స్వయంగా అతన్ని కాపాడారు. పక్కకు లాగి మంటలను ఆపే ప్రయత్నం చేశారు. ఘటనలో గాయాలపాలైన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.