మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2024 (10:51 IST)

జగనన్నకు అడ్వైజర్‌ను అందుకే గన్‌మెన్లు ఇచ్చారు : బోరుగడ్డ అనిల్ కుమార్

Borugadda Anil Kumar
తాను వైకాపా అధినేత జగనన్నకు అడ్వైజర్ (సలహాదారుడు) అని అందుకే తనకు గన్‌మెన్లను కేటాయించారని రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అన్నారు. నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పటి నిఘా చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకే తనకు సెక్యూరిటీ ఇచ్చారని తెలిపారు. 
 
గుంటూరులో ఏఈఎల్సీ చర్చి కోశాధికారి కర్లపూడి బాబు ప్రకాశ్‌ను బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేశారన్న కేసులో నిందితుడిగా ఉన్న బోరుగడ్డను అరండల్ పేట పోలీసులు ఆదివారం విచారించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఏ హోదాలో నీకు ప్రభుత్వం గన్‌మెన్ సౌకర్యం కల్పించిందని పోలీసులు ప్రశ్నించారు. అనిల్‌పై విధంగా జవాబిచ్చాడు. రూ.30 లక్షల ఖరీదైన ఓల్గార్స్ కారు ఎలా వచ్చింది. చాలా మంది చర్చి పాస్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణల గురించి అడుగగా.. తన పాత కారు అమ్మగా వచ్చిన రూ.28 లక్షలతో పాటు తన ఐదుగురు సిస్టర్స్ ఇచ్చిన డబ్బులతో రూ.45 లక్షలతో సెకండ్ హ్యాండ్ ఓల్లార్స్ కారు కొన్నానని అనిల్ చెప్పాడు. 
 
ఆ కారును తన తల్లికి గిఫ్టుగా ఇచ్చామని తెలిపారు. తాను ఎవరినీ బెదిరించలేదని తనపై ఫిర్యాదు చేసిన బాబు ప్రకాశ్ ఎవరో కూడా తనకు తెలియదని చెప్పాడు. ముందుగా రూ.50 లక్షలు డిమాండ్ చేసి ఆ తర్వాత బాబు ప్రకాశ్ కార్యాలయానికి వెళ్లి కత్తితో బెదిరించి తెచ్చుకున్న రూ.లక్షను ఏం చేశావని పోలీసులు ప్రశ్నించారు. ఆయనెవరో తెలియనప్పుడు రూ.లక్ష ఎలా ఇస్తాడని అనిల్ వ్యాఖ్యా నించాడు. ఎవరో తెలియనప్పుడు నీపై ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏమిటి.. అందులోనూ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఫిర్యాదు చేశాడు కదా అని ప్రశ్నించగా.. వైసీపీలో దళిత వర్గం నుంచి తాను ఎదగడం చూసి ఓర్చుకోలేక తప్పుడు ఫిర్యాదు చేసి ఉంటాడని అనిల్ చెప్పాడు.