శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 నవంబరు 2019 (13:16 IST)

వీసారెడ్డి గారూ.. చూసి కూడా చదవలేని వాడిని ముద్దపప్పు అంటారా?: బుద్ధా వెంకన్న

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ప్రసంగ పాఠాన్ని చదువుతూ పలు పదాలను ఆయన తప్పులతడకగా వుచ్చరించారు. ఈ వీడియోను టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్లో షేర్ చేశారు. 
 
ఇంకా జగన్‌ను వుద్దేశించి విజయసాయిరెడ్డిపై సెటైర్లు విసిరారు. ''నిరా రక్షత' అంటే నిరక్షరాస్యత, 'దీవితాన్ని పణంగా' అంటే జీవితాన్ని పణంగా, 'సంఘ సస్కర్తలు' అంటే సంఘ సంస్కర్తలు కాబోలు. ఆ 'రాజిక సౌద్దన్నాన్ని' అనేది మాత్రం అర్థం కాలేదు. మీకు అర్థమయితే చెప్పండి వీసారెడ్డి గారూ' అంటూ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. 
 
మీ ముఖ్యమంత్రి జగన్ హీరోయిన్ల పేర్లు చదువుతున్నారేంటి? ఓహో... నిరక్షరాస్యతకు వచ్చిన పాట్లా ఇవి అంటూ వెంకన్న సెటైర్ వేశారు. చూడకుండా ప్రసంగించే వ్యక్తి తప్పు మాట్లాడినప్పుడు 'పప్పు' అంటూ మీరు సంబరపడ్డారని... చూసి కూడా చదవలేనివాడిని ఏమంటారు విజయసాయిరెడ్డిగారూ... ముద్దపప్పు అనే కదా అంటారు అంటూ ఎద్దేవా చేశారు.