శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 1 నవంబరు 2019 (18:14 IST)

జగన్‌కు ఎప్పుడు శిక్ష పడుతుందా అని వైసీపీ నేతలు ఎదురు చూస్తున్నారు, అన్నదెవరు?

జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి షాక్ తగిలింది. తను ముఖ్యమంత్రి హోదాలో వున్నాను కనుక వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలంటూ పెట్టుకున్న పిటీషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీనితో సీఎం జగన్ పైన విపక్ష పార్టీ నేతలు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు.
 
ప్రతి శుక్రవారం నాడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు అయ్యేందుకు ప్రజాధనం ఎలా ఖర్చుపెడతారంటూ మాజీమంత్రి చినరాజప్ప విమర్శించారు. జగన్ తన కేసులకు సంబంధించి తన సొంత డబ్బును ఖర్చుపెట్టి కోర్టులకు హాజరు కావాలన్నారు. 
 
మరో మాజీమంత్రి యనమల మాట్లాడుతూ... జగన్ మోహన్ రెడ్డికి మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష పడటం ఖాయం అంటూ చెప్పారు. ఆయనకు శిక్ష ఎప్పుడు పడుతుందా అని వైసీపీ నాయకులు ఎదురుచూస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు యనమల.