శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 31 అక్టోబరు 2019 (19:09 IST)

జగన్ ఆస్తుల కేసులో మరో మలుపు

సీఎం జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఐఏఎస్ సివిఎస్‌కె శర్మపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వం నుండి న్యాయ సహాయం పొంది కూడా నకిలీ బిల్లులు సృష్టించి లక్షల రూపాయలు పొందారంటూ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
బిల్లుల విడుదల విషయంలో శర్మకు మాజీ సీఎస్ పీకే మహంతి, మాజీ రెవెన్యూ కార్యదర్శి పివి రమేష్ సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఫిర్యాదుదారుడు రమణ. జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు ఐఏఎస్‌లకు అప్పటి ప్రభుత్వం న్యాయ సహాయానికి నిధులు విడుదల చేసింది. 
 
అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి సివిఎస్‌కె శర్మ ప్రభుత్వానికి న్యాయ సహాయ బిల్లులు అందజేయడంలో చేతివాటం ప్రదర్శించినట్లు, తప్పుడు బిల్లులతో లక్షల రూపాయల నిధులు విడుదల చేసినట్టు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రమణ.
 
శర్మ పెట్టిన బిల్లులను సరిగ్గా పరిశీలించకుండానే ఆనాటి సిసిఎస్ పీకే మహంతి సంతకాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు రమణ. దీనిపై అప్పటి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి టి వి రమేష్ నిధులు విడుదల చేశారని ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని కోర్టును పి.వి.రమణ ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు సైఫాబాద్ పోలీసులు.