శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 జనవరి 2017 (14:49 IST)

పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి.. జగన్-పవన్ ఆ పని చేసివుండాలి: బీవీ రాఘవులు

ప్రత్యేక హోదాపై ఉద్యమానికి సన్నద్ధమవుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలను పక్కనబెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని సీపీఎం నేత బివి రాఘవులు అన్నారు. ప్రత్యేక హోదా కోసం అన్ని రాజకీయ పక్షాలు ఒకే

ప్రత్యేక హోదాపై ఉద్యమానికి సన్నద్ధమవుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలను పక్కనబెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని సీపీఎం నేత బివి రాఘవులు అన్నారు. ప్రత్యేక హోదా కోసం అన్ని రాజకీయ పక్షాలు ఒకే తాటిపైకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామని, భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ఉమ్మడి పోరాటాలు వస్తాయని చెప్పుకొచ్చారు. దేశంలోని నల్ల ధనంపై కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్పాలని బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. 
 
నిరంకుశత్వ పాలన ఎంతో కాలం సాగదని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. గతంలో ఇందిరా గాంధీకి సాధ్యం కాలేదని.. ఇప్పుడు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులకు కూడా సాధ్యం కాదని స్పష్టం చేశారు. నిరంకుశత్వంతో ముందుకు వెళ్లాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయన్నారు. వంశపారంపర్యం బూర్జువపార్టీలకు అలవాటని బీవీ రాఘవులు అన్నారు. కుటుంబ పాలన, పోలీసు పాలనతోటి ముందుకు కెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారని బీవీ రాఘవులు దుయ్యబట్టారు. 
 
మరోవైపు రిపబ్లిక్ డే రోజున విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో నిర్వహించాలనుకున్న ప్రత్యేక హోదా మౌన దీక్షకు పవన్ కల్యాణ్‌ వస్తే బాగుండేదని ప్రత్యేక హోదా సాధనసమితి నేత చలసాని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నప్పటికీ ఆయన అక్కడే దీక్షను కొనసాగించాల్సిందన్నారు.