గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (19:44 IST)

తిరుపతిలో ఎంతమెజారిటీతో గెలుస్తారో పెద్దిరెడ్డి, సజ్జల చెప్పగలరా? : పరుచూరి అశోక్ బాబు

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు వింటుంటే, దొంగే దొంగ అన్నట్లుగా ఉందని, ప్రభుత్వం, వైసీపీ చెప్పాల్పిన సమాధానాన్ని ఆయనే చెబుతున్నాడని, ఎన్నికల అథారిటీ మొత్తం తనేచూసినట్లుగా ఆయన మాట లున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు . తిరుపతిలో ఉపఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరగడంలేదని, మూగవాణ్ణి కొడితే ఎలాగైతే తనబాధ చెప్పుకోలేడో, తిరుపతిలో ప్రజాస్వామ్యం పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు.  తిరుపతికి  బయటివ్యక్తులు వేలల్లో వస్తుంటారని సజ్జల చెబుతున్నాడని, గత రెండు, మూడురోజులనుంచి చూస్తే రోజుకి 20వేలమంది కూడా తిరుమలకు వచ్చినట్టు లేదన్నారు.

ఈ ఒక్కరోజే లక్షమంది వచ్చారని సజ్జల చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. తిరుపతికి వచ్చే భక్తులను అడ్డుకునే శక్తి తెలుగుదేశం వారికిలేదని, మేము ఒకవేళ అలా అడిగితే ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం చూస్తూ ఊరుకుంటాయా అని అశోక్ బాబు ప్రశ్నించారు. తిరుపతికి వచ్చే యాత్రికులు ఎవరూ ఓటర్ కార్డులు చూపరని, ఎవరని ప్రశ్నిస్తే, వారు ఆధార్ కార్డులు చూపుతారన్నారు.

కానీ నేడు బయటినుంచి వచ్చిన వ్యక్తలు వద్ద పోలింగ్ స్లిప్పులు, ఓటర్ కార్డులేఉన్నాయని, ఆ విషయం సజ్జల ఎందుకు గుర్తించలేదో విచిత్రంగా ఉందన్నారు. 75శాతం గెలుస్తామని, 90శాతం ప్రజల మద్ధతు తమకే ఉందని చెప్పుకుంటున్న సజ్జలకు, ఆయనప్రభుత్వానికి, లోపల భయంగానేఉందని, అసలు తిరుపతి ఎన్నికలో గెలుస్తామో లేదోనన్న ఆందోళన తోనే అధికారపార్టీ ఇటువంటి దాష్టీకాలకు పాల్పడిందన్నారు.

15 రోజుల్లో టీడీపీ చేసిన ప్రచారంలోనే వైసీపీ ఓడిపోయిందన్నారు. గెలుపుసాధ్యం కాదని భావించే వాలంటీర్ల వ్యవస్థను వాడుకొని, ప్రభుత్వసమాచారాన్ని దుర్వినియోగంచే శారని అశోక్ బాబు ఆక్షేపించారు. చనిపోయినవారు, ఇతరప్రాంతాల్లో ఉంటున్నవారు, విదేశాలకు వెళ్లినవారి సమాచారం తీసుకొని,వారిస్థానంలో దొంగఓటర్లతో ఓట్లు వేయించే ప్రక్రియకు ప్రభుత్వం పూనుకుందన్నారు. 

నకిలీ ఓటర్ కార్డులు సృష్టించి మరీ, దొంగఓటర్లను ప్రభుత్వం తిరుపతికి తరలించిందన్నారు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా రోజుకి 20, 30వేలమందిభక్తులు  తిరుపతికి రావడం కష్టంగా ఉంటే, ఒక్కరోజే లక్షమంది వచ్చారని రామకృష్ణారెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమ న్నారు. ప్రజాస్వామ్యాన్ని నిశ్శబ్ధంగా వైసీపీప్రభుత్వం తిరుపతి ఉపఎన్నికలో ఖూనీ చేసిందనడానికి సజ్జల వ్యాఖ్యలే నిదర్శనమన్నారు.

స్థానిక ఎన్నికల్లో గెలిచామంటూ సజ్జల బీరాలుపలుకుతున్నాడని, తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్, అసెంబ్లీ ఉపఎన్నికలో ఓడిపోయిందన్నారు. ప్రజల తీర్పులు ఎప్పుడెలా ఉంటాయో తెలియదని, వైసీపీని కార్పొరేటర్ స్థాయిలో చూస్తే,  ఆపార్టీ అభ్యర్థులను ప్రజలు అక్కడ గెలిపిస్తారన్నారు. 90శాతంప్రజలు అధికారపార్టీకి మద్ధతుపలుకుతున్నప్పుడు, గెలుపుకోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం అధికారపార్టీకి ఎందుకొచ్చిందో సజ్జల చెప్పాలన్నారు. 

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుపతిలో ఇల్లుఉంటే, ఆయన అక్కడ మాట్లాడితే తప్పేమిటని సజ్జల అంటున్నాడని, మంత్రిఓటు పుంగనూరులో ఉంటే, తిరుపతి లో ఆయనకేం పనో చెప్పాలన్నారు. ఒకమనిషికి నాలుగు ఇళ్లు ఉన్నంత మాత్రాన నాలుగుచోట్ల ఓట్లు ఉండవన్నారు. రిక్షాకార్మకుడైనా, మంత్రైనా ఓటు ఎక్కడుంటే అక్కడే వినియోగించుకోవాలనే కనీస ఇంగితంకూడా సజ్జలకు లేకపోవడం బాధాకరమన్నారు.

తిరుపతి ఉపఎన్నికలో ఎంతమెజారిటీతో వైసీపీ గెలుస్తుందో, సజ్జల చెప్పగలడా అని అశోక్ బాబు నిలదీశారు. తిరుపతిలోని స్థానికులే వైసీపీ తీరుని అసహ్యించుకుంటున్నారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక నిర్వహించినా, కిందపనిచేసే అధికారులు, పోలీసులు అందరూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలప్రకారమే పనిచేశారని అశోక్ బాబు స్పష్టంచేశారు.

బస్సులు కనపడుతున్నా... బయటివ్యక్తులు దొరికిపోయినా  డీజీపీ సవాంగ్ ఏమీ లేదని చెప్పడం చూస్తేనే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. తిరుపతి ఉపఎన్నిక ఎలా జరిగిందో నేషనల్ మీడియాలో వచ్చిందని, అది  సజ్జలకు అర్థం కాకపోవడం సిగ్గుచేటన్నారు. పిల్లిలా కళ్లుమూసుకొని పాలుతాగకుండా, 400 బస్సుల్లో వచ్చిన స్థానికేతరులపై సజ్జల ఏం సమాధానంచెబుతాడన్నారు.

తిరుపతికి స్వామివారి దర్శనానికి వచ్చేవారు, ఓటర్ ఐడీలు, ఓటర్ స్లిప్పులు చూపడం, తండ్రిపేరు, భర్తపేరు అడిగితే  కార్డులో ఉన్నాయి చూసుకోమనడం వంటిసమాధానాలే వారెవరో చెప్పకనే చెబుతున్నాయన్నారు. ఈ విధంగా స్థాని కేతరులైనవారిని తరలించి, వారితో దొంగఓట్లు వేయించి గెలవాలని చూసినప్పుడే వైసీపీ ఓడిపోయిందన్నారు. 

రాజకీయంగా గెలవడం, నైతికంగా గెలవడం రెండూ ఒక్కటి కాదన్నారు. దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ, ఫ్యాక్షనిజం పోకడలతో పాలన చేసే నాయకుడిని చూసి, ప్రజలతోపాటు, అధికారయంత్రాంగం కూడా భయపడుతోందన్నారు. ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని, అందుకు నిదర్శనం తిరుపతి ఉపఎన్నికలో ప్రభుత్వం అనుసరించిన తీరేనన్నారు.

పథకాలపేరుతో ప్రభుత్వం ప్రజలను మోసగిస్తున్న తీరుని టీడీపీ వారికి అర్థమయ్యేలా వివరించిందికాబట్టే, ప్రజలు టీడీపీపక్షాన నిలిచారని పాలకు లకు అర్థంకాబట్టే, తిరుపతి ఉపఎన్నికలో గెలుపుకోసం వారు దొడ్డిదారులు, అడ్డ దారులు తొక్కారని అశోక్ బాబు స్పష్టంచేశారు. వాస్తవంలో ఇప్పుడు రాజకీయాలు ఎలాఉన్నాయో, తిరుపతిలో ఏం జరుగుతుందో, అక్కడివారే చెబు తున్నారన్నారు.

గతంలో రిగ్గింగ్ అంటే ఒక బ్యాలెట్ కో, ఒక పోలింగ్ బూత్ కో పరిమితమయ్యేదని, కానీ ఇప్పుడు లీగల్  రిగ్గింగ్ కు ప్రభుత్వమే పాల్పడటం దారుణమన్నారు. పోలింగ్ బూత్ ఓపెన్ చేయగానే ఒకేసారి దొంగఓటర్లంతా చొర బడటం, పోలీస్ వ్యవస్థను నోరెత్తకుండాచేయడం, ఏజెంట్లను అనుమతించకపోవ డం వంటివన్నీ ఈ ఉపఎన్నికలోనే చూస్తున్నామన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కళ్ల్యాణ మండపంలోఉన్నవారంతా యాత్రికులా.. వారంతా ఈరోజే వచ్చారా అని అశోక్ బాబు నిలదీశారు.

నిజంగా తిరుపతి ఉపఎన్నికలో 5లక్షల మెజారిటీతో  గెలుస్తామనే నమ్మకం సజ్జలకు ఉంటే, పెద్దిరెడ్డికి ఉంటే, రేపు  ఆ మెజారిటీ రాకపోతే వారు వారి పదవులకు రాజీనామాచేస్తారా అని అశోక్ బాబు సవాల్ చేశారు. పోలింగ్ పూర్తయ్యేలోగా ఎంతమెజారిటీ వస్తుందో సజ్జలగానీ, పెద్దిరెడ్డి గానీ చెప్పగలిగితే, వారు చెప్పినదానికి ఒక వంద అటోఇటో వస్తే, అప్పుడు వారిసత్తా ఏమిటో తెలుస్తుందన్నారు.

అధికారం చేతిలోఉందిక దా అని నేలపైపాకుతూ, ఆకాశంలో ఉన్నామని ప్రభుత్వపెద్దలు, మంత్రులు భ్రమపడుతు న్నారన్నారు. వైసీపీప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయిందనడానికి తిరుపతి ఉపఎన్నికలో నేడు అధికారపార్టీ అనుసరించిన విధానాలేకారణమన్నారు. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీకి 5లక్షల మెజారిటీ వచ్చితీరుతుందని ఘంటా పథంగా చెప్పగల ధైర్యం సజ్జలకు, పెద్దిరెడ్డికి లేవన్నారు.

పోలింగ్ బూత్ లలో ఏవైనా జరిగితే ఆర్వోలు ఫిర్యాదుచేస్తారని, బయట జరిగినవాటిపై టీడీపీనేతలు ఫిర్యాదుచేస్తే, పోలీసులు ఫిర్యాదులు తీసుకోవడం లేదన్నారు. బస్సులలో వచ్చిన వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు పట్టిచ్చినా వారిలో స్పందన లేకపోవడం దారుణమన్నారు. తిరుపతి ఉపఎన్నికను రద్దుచేయాలని తామ  డిమాండ్ చేస్తున్నామని, పోలింగ్ రోజు జరిగిన ప్రజాస్వామ్యవ్యతిరేక చర్యలపై ఎన్నికలసంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

మంత్రి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే, ఆయనకు తిరుపతిలో ఇల్లుందని సమర్థించుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రాన్ని రక్షించమని తిరుపతి వేంకటేశ్వరస్వామిని వేడుకుం టున్నామని, ప్రజలుకూడా టీడీపీ చేసిన ప్రచారాన్ని నమ్మారుకాబట్టే, నేడు ప్రభుత్వవిధానాలను ఎండగట్టారని అశోక్ బాబు తెలిపారు.