1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 మార్చి 2022 (11:09 IST)

ఏపీకి కేంద్రం శుభవార్త: రాష్ట్రానికి ఏడు ఈఎస్ఐ ఆస్పత్రులు మంజూరు

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రానికి ఏడు నూతన ఈఎస్‌ఐ ఆస్పత్రులను మంజూరు చేసింది. సోమవారం నాడు పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కొత్త ఈఎస్‌ఐ ఆస్పత్రుల వివరాల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా ఈ విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
విశాఖలో రూ.384.26 కోట్లతో సీపీడబ్ల్యూడీ శాఖతో నూతన ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మితం అవుతుందని.. విజయనగరంలో రూ.73.68 కోట్ల కేంద్ర నిధులతో ఎంఈసీఓఎన్ కంపెనీ ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మితం అవుతుందని.. కాకినాడలో రూ.102.77 కోట్ల కేంద్ర నిధుల కేటాయింపుతో సీపీడబ్ల్యూడీ శాఖ సహకారంతో కొత్త ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందని కేంద్రం వెల్లడించింది.
 
ఆరోగ్య వసతుల లేమితో బాధపడుతున్న ఏపీ ప్రజలకు కేంద్రం మంజూరు చేసిన ఈఎస్‌ఐ ఆస్పత్రుల వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు.