శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (14:13 IST)

వైసీపీ ప్రభుత్వం ఏపీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది: చంద్రబాబు

గుంటూరు : వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పీపీఏలపై జగన్‌ ప్రభుత్వానివి తప్పుడు నిర్ణయాలని ఆరోపించారు. టీడీపీ హయంలో జెన్‌కో, ట్రాన్స్‌కోను దేశంలోనే నెంబర్‌ వన్‌ చేశామన్నారు. సంస్కరణలతో కరెంట్‌ కోతలను అధిగమించామన్నారు.
 
డిస్కంలకు అప్పులు లేకుండా చేశామని, కరెంట్‌ కోతల నుంచి మిగులు విద్యుత్‌ సాధించామని చంద్రబాబు చెప్పారు. విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీనేనని ఆయన స్పష్టం చేశారు. నాణ్యమైన, తక్కువ ధరకు కరెంట్‌ ఇవ్వాలని ముందుకెళ్లామని, దురుద్దేశంతోనే విద్యుత్‌ ఒప్పందాలు జరిగాయని ఎలా అంటారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.