బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2023 (19:21 IST)

తుపాను సహాయక చర్యలను విస్తృతం చేయండి.. బాబు

Babu
మైచాంగ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలను సమీపిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను విస్తృతం చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. 
 
మైచాంగ్ తుపాను ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుందన్న సమాచారం ఆందోళన కలిగిస్తోందని, ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచించారు. 
 
తుపాను వల్ల రైతులు నష్టపోకుండా చూడాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. గతంలో అకాల వర్షాలతో ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదన్నారు.