ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శనం చేసుకున్న చంద్రబాబు దంపతులు
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. జగన్మాతకు ప్రత్యేక పూజలను చంద్రబాబు దంపతులు నిర్వహించారు.
అనంతరం వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ ఈ కోటేశ్వరరావు, ఏఈఓ చంద్రశేఖర్, స్థానాచార్యులు ఇతర అధికారులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను చంద్రబాబు దంపతులకు అందజేశారు.
కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు నుంచి బెయిల్ ద్వారా బయటికి వచ్చిన చంద్రబాబు.. సోమవారం శ్రీవారికి దర్శించుకున్నారు. ఈనెల ఐదో తేదీన శ్రీశైలం మల్లన్న సేవలో చంద్రబాబు పాల్గొననున్నారు. అలాగే రానున్న రోజుల్లో కడప దర్గా, గుణదల మేరీ మాత చర్చిలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు దర్శించుకోనున్నారు.