మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 మార్చి 2017 (12:26 IST)

భూమాను కోల్పోవడం కర్నూలుకే కాదు రాష్ట్ర రాజకీయాలకు పెద్ద లోటు: చిరంజీవి

టీడీపీ నేత భూమా నాగిరెడ్డి మృతి చెందడం కేవలం కర్నూలు జిల్లాకు మాత్రమే కాదు ఏపీ రాజకీయాలకు పెద్దలోటు అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు చిరంజీవీ అన్నారు. భూమా మృతిపై తన సానుభూతి వ్యక్తం చేశార

టీడీపీ నేత భూమా నాగిరెడ్డి మృతి చెందడం కేవలం కర్నూలు జిల్లాకు మాత్రమే కాదు ఏపీ రాజకీయాలకు పెద్దలోటు అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు చిరంజీవీ అన్నారు. భూమా మృతిపై తన సానుభూతి వ్యక్తం చేశారు. భూమా ఆత్మకు శాంతి చేకూరాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. 
 
అలాగే, టీడీపీ మాజీ ఎంపీ, మరో సినీ నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ, తనకు స్నేహితుడు, సన్నిహితుడు అయిన భూమాను కోల్పోవడం తనను కలచివేసిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. 
 
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తన సంతాపం తెలిపారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి తమ కుటుంబానికి అత్యంత ఆప్తులన్నారు. నాగిరెడ్డి మృతితో తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, భూమా మృతిపై ఏపీ శాసనమండలి స్పీకర్ చక్రపాణి తన సంతాపం తెలిపారు.