శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (13:16 IST)

చెల్లెలు నిత్యం ఫోనులో మాట్లాడుతుందని.. బాలుడిపై అన్నయ్య దాడి..

తన చెల్లెలు ఓ అబ్బాయితో నిత్యం ఫోన్లో మాట్లాడుతుందని తెలుసుకున్న అన్న.. చెల్లెలికి భయం చెప్పకుండా.. ఆ అబ్బాయిని ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. అంతేకాదు అతని ఫ్రెండ్స్‌తో కలిసి దాడి చేయించాడు. మైనర్ బాలుడు అని కూడా చూడకుండా దారుణంగా కొట్టాడు. 
 
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన ఓ యువతి.. నిత్యం ఫోన్లో మాట్లాడుతోంది. అనుమానం వచ్చిన ఆమె అన్న ఆరా తీయగా.. నిమ్మపల్లె రోడ్డుకు చెందిన మైనర్ బాలుడితో మాట్లాడుతున్నట్లు తేలింది. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న యువతి అన్న..ఆ బాలుడ్ని మాట్లాడలని రవి రుచులు లాడ్జ్ వద్దకు పిలిపించాడు.
 
అదే లాడ్జిలో రూమ్ బుక్ చేసి బాలుడ్ని తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేశాడు. బాలుడు క్షమించి వదిలేయాలని ఎంత ప్రాధేయపడినా కనికరించని యువతి అన్న, అతడి స్నేహితులు కాళ్లతో తన్నుతూ ఆ దాడి ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. 
 
దీనిపై బాలుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో మదనపల్లి టూ టౌన్ ఎస్సై దాడికి పాల్పిడిన వారిపై కేసు నమోదు చేశారు. 
 
వీడియో ఆధారంగా బాలుడిపై దాడిన చేసిన వారిని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలుడిపై ఇంతదారుణంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అతడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.