శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Updated : గురువారం, 4 మే 2017 (15:39 IST)

మీ ఇద్దరూ నా కోర్కె తీర్చాల్సిందే... తీర్చకపోతే ఏం చేస్తానో తెలుసా...? చిత్తూరులో కామ పోలీస్...

చిత్తూరుజిల్లాలో కామ పోలీసులు పెరిగిపోతున్నారు. సహచర ఉద్యోగస్తులను వేధించడమే పనిగా ఈ కామపోలీసులు పెట్టుకున్నారు. ప్రస్తుతం మీకు చెప్పబోయేది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా కుప్పంలోన

చిత్తూరుజిల్లాలో కామ పోలీసులు పెరిగిపోతున్నారు. సహచర ఉద్యోగస్తులను వేధించడమే పనిగా ఈ కామపోలీసులు పెట్టుకున్నారు. ప్రస్తుతం మీకు చెప్పబోయేది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా కుప్పంలోని కామ పోలీస్. ఈ కామ పోలీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇతను ఏ స్టేషన్‌లో విధులు నిర్వహించినా అక్కడ మహిళా కానిస్టేబుళ్ళ పరిస్థితి అధోగతేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
ఈయన చెప్పినట్లు వింటే మాత్రం ఏ పని చెప్పకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు... లేకుంటే ఇక చెప్పనవసరం లేదు. నరకాన్ని వారికి చూపిస్తాడు. ఇంతకీ ఎవరాయన.
 
చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన సిఐ రాజశేఖర్ రాజకీయ పలుబడి కలిగిన వ్యక్తి. అధికార తెలుగుదేశం పార్టీ నేతలతో దగ్గర సంబంధాలున్న రాజశేఖర్ ఆడిందే ఆట.. పాడిందే పాట. ఈయన ముందు ఏ పోలీసు ఉన్నతాధికారులు పెద్దగా మాట్లాడరు. విమర్శించరు. ఆయన ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అందుకే ఆ సిఐ ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతోంది. తాజాగా తన స్టేషన్ లోని ఇద్దరు కానిస్టేబుళ్ళు నిర్మల, రేణుకలను కోర్కె తీర్చమని వేధించాడనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి.
 
ప్రతిరోజు ఏదో ఒక వంక పెట్టి వారిని తన గదికి పిలిపించుకోవడం అసహ్యంగా ప్రవర్తించేవాడని వారు చెపుతున్నారు. సిఐ కావడంతో చేసేది లేక సైలెంట్ ఉండిపోయారు. రాజశేఖర్ మరింత రెచ్చిపోవడంతో ఇక చేసేది లేక గత నెల 27వ తేదీన చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేద్దామని ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళు చిత్తూరుకు వచ్చారు. అయితే ఎస్పీ సెలవుపై వెళ్ళాడు. దీంతో నిరాశతో వెనుతిరిగారు కానిస్టేబుళ్ళు. ఈ విషయం కాస్త రాజశేఖర్ దృష్టికి వెళ్ళింది.
 
ఇక కల్లు తాగిన కోతిలా మారిపోయాడట రాజశేఖర్. ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను చెప్పింది చేయండనీ, తన కోర్కె తీర్చకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తాననీ, ఉద్యోగం లేకుండా చేస్తానంటూ బెదిరించారంటూ వారు చెప్పారు. దీంతో రెండురోజుల క్రితం మళ్ళీ సెలవు పెట్టి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళు ఎస్పీని కలిశారు. అయితే అక్కడ తమకు సరైన సమాధానం రాలేదనీ, అందువల్ల చేసేది లేక పోలీస్ కార్యాలయం ముందే నిద్రమాత్రలు మింగి నిర్మల అనే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 
 
చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇంత జరిగినాసరే రాజశేఖర్ పైన అటు ప్రభుత్వం కానీ, ఇటు పోలీస్ బాస్ కానీ పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై సహచర మహిళా కానిస్టేబుళ్ళు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రాజశేఖర్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ రాజశేఖర్ మాత్రం తన రాజకీయ పలుకుబడితో కేసు పెట్టనీయకుండా చూసుకుంటున్నారు.