బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 15 మే 2021 (19:50 IST)

సీఐడీ పోలీసులు నన్ను కొట్టారు: రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు

గుంటూరు: ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో హైడ్రామా చోటుచేసుకుంది. సీఐడీ పోలీసులపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. తనను సీఐడీ పోలీసులు కొట్టారని న్యాయవాదులకు ఎంపీ తెలిపారు.

ఈ మేరకు జడ్జికి లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్టును మెజిస్ట్రేట్ తిప్పిపంపారు. మరోవైపు లాయర్ ఆదినారాయణరావు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో డివిజన్ బెంచ్‌లో విచారణ జరగనుంది. 
 
ఇదిలా ఉండగా, కోర్టుకు వెళ్లకుండా పోలీసులు తమను అడ్డుకున్నారని రఘురామ తరఫు లాయర్లు తెలిపారు. పబ్లిక్ కోర్టులోకి వెళ్లేందుకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని లాయర్ గోపినాథ్ అన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఒంటిపై గాయాలున్నాయని ఆయన తెలిపారు. కోర్టులోకి న్యాయవాదులను వెళ్లనివ్వడం లేదని ఆరోపించారు.