శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 15 మే 2021 (16:08 IST)

ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త

ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వంలోని 8 శాఖలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి జగన్ సర్కార్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కాలపరిమితిని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
మరోవైపు ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగానే పరిగణలోకి తీసుకోవాలని.. సకాలంలో జీతాలు చెల్లించాలని గతంలోనే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

పర్మినెంట్ ఉద్యోగులకు కల్పించే ప్రయోజనాలు అన్ని కూడా వారికి అందించేలా నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంపై కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.