బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 2 జనవరి 2021 (19:54 IST)

సీఎం నరరూప రాక్షసుడు : చంద్రబాబు

శ్రీరాముడిని కాపాడే బాధ్యత సీఎం జగన్‌కు లేదా? ఈ సీఎంని నరరూప రాక్షసుడు అనాలా?.. ఏమనాలి? అని  టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.  ఈ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి జగనే కారణమన్నారు.

‘‘నా హయాంలో మసీదు, చర్చిలపై దాడులు జరిగాయా? దేశమంతా జై శ్రీరామ్‌ నినాదం మార్మోగుతుంటే.. ఉత్తరాంధ్ర అయోధ్యలో రామచంద్రుడి తల నరికారు. ఎన్టీఆర్‌ హయాంలో రామరాజ్యం చూశాం.

పోలీసులు తమాషాలు చేస్తున్నారా?... అందరూ తిరగబడితే పోలీసులు పారిపోతారు. పోలీసులు నా ముందు తోక తిప్పుతారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఇలాంటి చోటామోటా నాయకుల్ని చాలా మందిని చూశామని, తన దగ్గర మీ నాటకాలు నడవవని హెచ్చరించారు. ఇది పులివెందుల రాజకీయం అనుకుంటున్నారా అని చంద్రబాబు నిలదీశారు. బాబాయ్‌ని చంపినా అడిగేవారు లేరనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

19 నెలల్లో 127 దేవాలయాలపై దాడులు జరిగాయని తెలిపారు. దేవాలయాల భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడి ఆస్తుల దగ్గరికి వస్తే ఖబడ్దార్‌.. మసైపోతారని చంద్రబాబు హెచ్చరించారు.