శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 11 నవంబరు 2021 (13:07 IST)

మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతి... సీఎం జ‌గ‌న్ నివాళి

ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఎస్‌బి అంజాద్‌ బాషా, ఎమ్మెల్సీ మహమ్మద్‌ కరీమున్నిసా, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీం అహ్మద్ పాల్గొన్నారు.
 
 
ఇక తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా  భారతదేశ మొదటి విద్యాశాఖమంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు నిర్వ‌హించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.


ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటి ముఖ్యమంత్రి బేపారి అంజాద్ భాషా, శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, ఎంఎల్ఏ అఫీజ్ ఖాన్, పార్టీ మైనారిటీ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు ఖాదర్ భాషా, ఉర్దు అకాడమి ఛైర్మన్ నదీమ్ అహ్మద్, ఎంఎల్సి అభ్యర్దిగా ఎంపికైన ఇషాక్, పలువురు పార్టీ నేతలు నివాళులు అర్పించారు.