బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 6 జులై 2021 (23:17 IST)

సీఎం జగన్ పులివెందుల పర్యటన: భద్రతా ఏర్పాట్లు

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి పులివెందుల పర్యటన నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి నివాసం, బహిరంగ సభాస్థలి వద్ద చేపట్టవలసిన భద్రతా చర్యలపై పోలీస్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
 
పులివెందుల లోని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ  వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారు ఆదేశించారు. సి.ఎం నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేయాలని జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారు ఆదేశించారు.  భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. 
 
జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారి వెంట జిల్లా అదనపు ఎస్.పి (ఆపరేషన్స్) ఎం. దేవ ప్రసాద్, ఏ.ఆర్ అదనపు ఎస్పీ మహేష్ కుమార్, పులివెందుల డి.ఎస్.పి శ్రీనివాసులు, ఏ.ఆర్ డి.ఎస్పీ రమణయ్య, కడప డి.ఎస్.పి సునీల్, ప్రొద్దుటూరు డి.ఎస్.పి ప్రసాద రావు, పులివెందుల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వై.ఎస్ మనోహర్ రెడ్డి, పాడా ఓ.ఎస్.డి అనిల్ కుమార్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ వి.వి నరసింహా రెడ్డి, ఆర్ అండ్ బి డి.ఇ శ్రీధర్ రెడ్డి, పోలీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.