ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (20:58 IST)

క్రికెట్‌ ఆడిన సీఎం జగన్‌: బ్యాట్​పట్టి రెండు బంతులు ఆడారు..

కడప వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. రూ. 4 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఫ్లెడ్ లైట్ల నిర్మాణానికి కూడా జగన్ శంకుస్థాపన చేశారు. 
 
అనంతరం.. సరదాగా కడప వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో క్రికెట్‌ ఆడారు. పాలనలో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి కడప జిల్లా పర్యటనలో కాసేపు సరదాగా క్రికెట్​ ఆడారు. బ్యాట్​పట్టి రెండు బంతులు ఆడి ముఖ్యమంత్రి అభిమానులను అలరించారు. 
 
సీఎం జగన్ క్రికెట్ ఆడిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నగరంలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంను ఆయన సందర్శించారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు.