శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శుక్రవారం, 20 ఆగస్టు 2021 (11:38 IST)

క‌లెక్ట‌ర్ల త‌నిఖీలు... గ్రామ సచివాలయ సిబ్బందికి టెన్ష‌న్!

గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్ని క‌లెక్ట‌ర్లు, ఇత‌ర ఉన్న‌తాధికారులు త‌ర‌చూ త‌నిఖీ చేయ‌డం ప్రారంభించారు. మీరు త‌నిఖీ చేయ‌క‌పోతే, ఎలా అని ఎపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్న‌తాధికారుల‌కు చీవాట్లు పెట్ట‌డంతో వారు స‌చివాల‌యాల‌పై దాడులు ప్రారంభించారు. దీనితో స‌చివాల‌య సిబ్బంది టెన్ష‌న్ ప‌డిపోతున్నారు.

గ్రామ సచివాలయాల సిబ్బంది కార్యాలయ పనివేళల్లో తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామ సచివాలయాన్ని కలెక్టర్‌ ఆకస్మిక తణిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయంలో హాజరు పట్టికను పరిశీలించారు. నోటీసు బోర్డులో ప్రదర్శనకు ఉంచిన సంక్షేమ పధకాల లబ్దిదారుల జాబితా, ఫీవర్ సర్వే నివేదికలు, సంక్షేమ పధకాల పోస్టర్లను పరిశీలించారు. అనంతరం సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ నివాస్ మాట్లాడుతూ సచివాలయానికి స్పందన కార్యక్రమం ద్వారా అందిన ధరఖాస్తులను అదేరోజు సంబంధిత అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను వారికి పూర్తిగా తెలియజెప్పి, వాటి ఫలాలను వారు సద్వినియోగం చేసుకునే విధంగా వాలంటీర్లు పనిచేయాలన్నారు. పధకాలకు ధరఖాస్తు చేసుకునే విధానాన్ని లబ్ధిదారులకు తెలియజేయాలని, ధరఖాస్తు చేసుకునేందుకు వారికి సహకరించాలన్నారు.

కార్యాలయ పనివేళల్లో సిబ్బంది అందరూ తప్పనిసరిగా గ్రామ సచివాలయంలోనే ప్రజలకు అందుబాటులని ఉండాలని, సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు ప్రజల నుండి స్పందన ధరఖాస్తులను స్వీకరించాలని కలెక్టరు ఆదేశించారు. కలెక్టరు వెంట రెవెన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి, తాహశీల్దారు వి.వి.భరత్ రెడ్డి, ఎంపిడివో పి.భార్గవి, త‌దిత‌రులు పాల్గొన్నారు.