గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , బుధవారం, 22 సెప్టెంబరు 2021 (15:27 IST)

కనెక్ట్ ఆంధ్రా ఐ.ఓ.సి ఎంప్లాయిస్ రూ.25 లక్షల మెడికల్ కిట్స్ వితరణ

కనెక్ట్ ఆంధ్రా ఐ.ఓ.సి ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో రూ.25 లక్షల విలువైన మెడికల్ కిట్స్ వితరణ ఇవ్వడం అభినందించదగ్గ విషయమని తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం.గురుమూర్తి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక రుయా ఆసుపత్రి భువన విజయం ఆడిటోరియంలో సి.ఇ. ఓ,  కొటేశ్వరమ్మ ఐ.ఆర్.ఎస్., జి.ఎం. స్వామినాథన్ లు ఈ కిట్ల‌ను ఎం.పి. చేతుల మీదుగా రుయా ఆసుపత్రికి అందించారు. 
 
ఎం.పి. మాట్లాడుతూ, త‌మ‌ అభ్యర్థన మేరకు ఐ.ఓ.సి. కనెక్ట్ ఆంధ్రా స్పందించి నేడు రూ.25 లక్షల విలువ గల మెడికల్ కిట్స్ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. రుయా ఆసుపత్రి డాక్టర్లు ఎంతో చొరవతీసుకుని  కోవిడ్ సమయంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడారని అన్నారు. సి.ఈ.ఓ మాట్లాడుతూ, ఎం.పి. మెడికల్ పరంగా ఆదుకోవాలని సూచించారని, ఆ మేరకు నేడు ఈ వితరణ చేపట్టామని అన్నారు. 
 
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్లానింగ్ ఎంప్లాయిస్ కనెక్ట్ ఆంధ్రా ప్రోగ్రామ్ లో రూ.25 లక్షల విలువ గల ఎన్-95 మాస్క్ లు, 3926, పిపిఇ కిట్స్ 6210, గ్లౌజులు 4015, సానిటైజర్లు 500 ఎం.ఎల్.: 3808, 100 ఎం.ఎల్.:3808 రుయా ఆసుపత్రికి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రుయా వర్కింగ్ కమిటి చైర్మన్ చంద్రశేఖర్, రుయా సూపర్నెంట్ డా.భారతి, డి.ఎం.హెచ్.ఓ.డా. శ్రీహరి , ఆర్.ఎం.ఓ. డా.ఇ. బి.దేవి, డాక్టర్లు పాల్గొన్నారు.