గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (07:27 IST)

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంతో కరోనా నివారణ: ఆదిత్యానాధ్ దాస్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రంణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన  చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2.16 కోట్ల కొవిడ్ టెస్టు నిర్వహించామని తెలిపారు.

వాటిలో ఆర్టీపీసీఆర్ ద్వారా 1,47,74,072 టెస్టులు,ర్యాపిడ్ యాంటిజనెన్ విధానం ద్వారా 68,63,534 టెస్టులు నిర్వహించడం జరిగిందని సిఎస్ పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 18,75,622 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18,16,930 మంది వ్యాధి నుండి కొలుకున్నారని తెలిపారు.

కరోనా కారణంగా ఇంత వరకూ 12,566 మంది మృతి చెందారని సిఎస్ చెప్పారు. అదే విధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,48,64,205 మందికి టీకాలు వేశామని సీఎస్ ఆదిత్యానాధ్ దాస్ పేర్కొన్నారు. కాగా.. 1,19,54,827 మందికి ఒక డోసు, 29,09,378 మందికి రెండు డోసులు వేశామన్నారు.

జర్వ పీడితుల గుర్తింపునకు చేపట్టిన ఇంటింటి సర్వేలో 1,42,55,516 కుటుంబాల నుంచి నమూనాల సేకరించామన్నారు.

కరోనా నివారణలో భాగంగా ఒక వైపు కర్ఫ్యూ విధిస్తూనే, మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా కొనసాగిస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రవేట్ భాగస్వామ్యం ద్వారా మరింత వేగవంతంగా రాష్ట్రంలో కరోనా నివారణ సాధ్యమవుతుందన్నారు.