శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 16 జూన్ 2021 (08:33 IST)

కరోనా 3వ విడతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: మంత్రి ఆళ్ల నాని

కరోనా మూడవ విడత హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. మూడవ విడత కరోనా హెచ్చరికల నేపథ్యంలో ముప్పును సాధ్యమైనంత మేర తగ్గించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం పిడియాట్రిక్‌ అంశాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, దీనికోసం అవసరమైతే ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

అన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ చిన్నారులకు వైద్య చికిత్స సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులను ముందుగానే పరిశీలించి అవకాశం ఉన్న చోట పిల్లలకు చికిత్స అందించడానికి సిద్ధమవ్వాలని చెప్పారు.

అవసరమైన వైద్యులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. బ్లాక్‌ ఫంగస్‌ నివారణకు అవసరమైన ఇంజెక్షన్లను బ్లాక్‌మార్కెట్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలిని ఆదేశించారు.