బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 21 జులై 2021 (20:25 IST)

విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు

విశాఖ మన్యంలోని జికె.వీధి మండల పరిధి అమ్మవారి దారకొండ, పెద్దంపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం గ్రేహౌండ్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

గ్రేహౌండ్స్‌ దళాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపడుతున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు బృందాలూ కాల్పులు జరుపుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టులు తప్పించుకున్నారు.

ఎదురుకాల్పులను ఎఎస్‌పి తుషార్‌ డూడి ధ్రువీకరించారు. ఈ నెల 28 నుంచి మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే గ్రామాలను జల్లెడ పడుతున్నారు.

ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేపడుతున్నారు. తాజా కాల్పులతో మన్యంలోని మారుమూల ప్రాంతాల గిరిజనులు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయందోళన చెందుతున్నారు.