మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2020 (12:58 IST)

కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ విశ్వప్రయత్నాలు.. యుద్ధ ప్రాతిపదికన చర్యలు

కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు వైద్యులతో ఐదు కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు  చేసింది. ఈ కమిటీలను మానిటర్ చేసేందుకు ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. 
 
కరోనా అనుమానితులను అడ్మిట్ చేసుకునేందుకు ప్రైవేటు హాస్పిటళ్లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. గురువారం వారితో సమావేశం నిర్వహించింది. మంత్రి ఈటెల, డీఎంఈ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, డీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాసరావు సహా పలువురు ఆఫీసర్లు ఈ మీటింగ్​లో పాల్గొన్నారు. కరోనా పేరిట ఎవరినీ ఆందోళనకు గురి చేయొద్దని సూచించారు. గైడ్​లైన్స్​విడుదల చేశారు.
 
అలాగే కేరళలో కరోనా కట్టడికి తీసుకున్న చర్యలను స్టడీ చేసేందుకు జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి.సంతోష్ నేతృత్వంలోని 12 మంది ఆఫీసర్ల బృందం గురువారం కేరళకు వెళ్లింది. అక్కడి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులు, హాస్పిటళ్లలో కరోనా స్క్రీనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ టీమ్ పరిశీలించనుంది. 
 
త్రివేండ్రం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా, ఇతర దవాఖాన్లలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్డులను చూస్తుంది. ఈనెల 8న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరిగి వస్తుంది. మరోవైపు శుక్రవారం ఢిల్లీకి ఇంకో టీమ్ వెళ్లనుంది. సెంట్రల్ హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ నిర్వహించే సమావేశంలో పాల్గొంటుంది. మరోవైపు కరోనాపై వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది.