సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (16:36 IST)

మనిషి నుంచి కుక్కకు.. కరోనా వైరస్ వ్యాప్తి.. హాంకాంగ్‍లో తొలి కేసు

ఇప్పటివరకు కరోనా వైరస్ మనుషులకు మాత్రమే సోకుతూ భయభ్రాంతులకు గురిచేస్తూ వచ్చింది. అయితే, ఈ వైరస్ మనుషులు ద్వారా పెంపుడు జంతువులకు కూడా సోకుందని తేలింది. తాజాగా ఓ ఇంట్లోని పెంపుడు శునకానికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ శునకాన్ని క్వారంటైన్‌కు తరలించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, హాంకాంగ్‌కు చెందిన 60 యేళ్ళ మహిళ ఓ శునకాన్ని పెంచుకుంటూ ఉంది. ఆమె కరోనా వైరస్ బారినపడి కోలుకుంది. అయితే, ఆమె పెంపుడు శునకం కూడా ఈ వైరస్ బారినపడింది. దీన్ని గుర్తించిన స్థానిక అధికారులు ఆ శునకాన్ని జంతువుల క్వారంటైన్‌కు పంపించారు. గత శుక్రవారం నుంచి దానికి క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో దానికి బలహీన స్థాయిలో కరోనా వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఈ దెబ్బకు హాంకాంగ్ ప్రభుత్వం పెంపుడు జంతువులకు కూడా ప్రత్యేక క్వారంటైన్ (ఐసోలేష్ వార్డుల తరహాలోనే)ను ఏర్పాటు చేసింది. ఇక్కడ కరోనా వైరస్ పడిన జంతువులకు 14 రోజుల పాటు అక్కడ ఉంచి చికిత్స అందిస్తారు. మనుషుల ద్వారా శునకానికి కరోనా వైరస్ సోకడం ప్రపంచలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.