శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 5 మార్చి 2020 (14:24 IST)

కరోనా వైరస్ పైన రాఖీ సావంత్, అలా బుక్కయింది

రాఖీ సావంత్
ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో మునిగితేలుతూ నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కరోనా వైరస్ పైన చేసిన వివాదాస్పద వీడియో ప్రస్తుతం నెటింట్లో బాగానే వైరల్ అవుతోంది. కరోనా వైరస్‌ని అంతమొందించడానికి చైనా దేశానికి వెళుతున్నానని.. తనతో పాటు ప్రముఖ స్పేస్ సంస్థ నాసా తయారు చేసిన ప్రత్యేక మందులను తీసుకెళుతున్నానని చెప్పింది రాఖీ.
 
కరోనా వైరస్‌ను అంత మొందించడానికి అన్న మాటను నెటిజన్లు బాగా పట్టుకున్నారు. ఇందులో భాగంగా కరోనా వైరస్‌ని అంతమొందించడానికి  చైనాకు వెళ్ళిన రాఖీ సావంత్ ఉన్నావా.. పోయావా..? అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారట. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

నాసా సంస్థ శాటిలైట్‌లకు సంబంధించి విషయాలను మాత్రమే చూస్తోందని ఒకవేళ కరోనా వైరస్‌ని నియంత్రించేందుకు మందు కనిపెడితే డైరెక్టుగా చైనాకే పంపిస్తుంది కానీ అసలు ఎటువంటి సంబంధం లేనటువంటి రాఖీ సావంత్‌కి ఎందుకు పంపిస్తారని ప్రశ్నిస్తారు. మొత్తానికి నోటికొచ్చినట్లు మాట్లాడి రాఖీ సావంత్ అడ్డంగా బుక్కనట్లుంది.