గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , గురువారం, 2 సెప్టెంబరు 2021 (18:43 IST)

పాఠశాలలో విధిగా కోవిడ్ నిభందనలు: అదనపు కమిషనర్ డా.జె.అరుణ‌

పాఠశాలల్లో అత్యవసర సౌకర్యాలు కల్పించ‌డానికి చేపట్టవలసిన చర్యలపై గురువారం విజ‌య‌వాడ  నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డా.జె.అరుణ‌ తనిఖి చేసారు. నగర పరిధిలోని మూడు పాఠశాల్లో శిదిలామైన భవనాలైన దుర్గాపురంలోని వెంకటేశ్వరరావు ఉన్నత, ప్రాధమిక  పాఠశాలలను సందర్శించి పెచ్చులూడిన గదులను, దెబ్బతిన్న కిటికీలు, గోడలను పరిశీలించారు. వెంటనే వార్డ్ ఎనిమిటిస్ సెక్రటరి అబ్దుల్ రహీమ్ కు ఎస్టిమేషన్ వేసి పంపవలసినందిగా ఆదేశించారు. అనంత‌రం అరుణ హైస్కూల్, ప్రైమరీస్కూల్ తరగతుల విద్యార్ధులు, టీచర్లతో ముచ్చటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
 
సత్యనారాయణపురంలోని ప్రశాంతి  ప్రాధమిక  పాఠశాల, ఎకెటిపిఎం హైస్కూల్ సందర్శించి అక్కడ  ఎనిమిటిస్ సెక్రటరి నాగరాజు వ‌ద్ద ఎస్టిమేషన్ వివరాలు సేకరించారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు పాఠశాలలో 1850 మంది విద్యార్ధులకు అదనపు తరగతుల అవసరమని ప్రస్తావించగా, వెంటనే ప్రపోజల్స్ పంపవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
 
ప్రతి పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు అందరూ కోవిడ్ నిభందనలు పాటిస్తూ,  పాఠశాల కార్యక్ర‌మాలు నిర్వహించాలని, మధ్యాహ్నం భోజన సమయంలో పరిశుభ్రత,  సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యకమoలో పాఠశాలల సూపర్వైజర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు