శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2019 (16:51 IST)

రాయలసీమను కేసీఆర్ అభివృద్ధి చేస్తారట : సీపీఐ రామకృష్ణ సెటైర్లు

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నాయకులు అనుసరిస్తున్న తీరు ఎవరో దాయా దాక్షిణ్యాల మీద ఉన్నట్లు అనిపిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆర్టికల్ 370 విషయంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఒప్పించడంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక పాత్ర పోషించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్తున్నారన్నారు. 
 
ఆర్టికల్ 370 అంశంలో అంత పాత్ర పోషించినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు వెంకయ్య నాయుడు కీలక పాత్ర పోషించడం లేదని ఆయన ప్రశ్నించారు. వెంకయ్య నాయుడుకు ఏ మాత్రం నిబద్ధత ఉన్నా, చిత్త శుద్ధి ఉన్న రాష్ట్ర ప్రయోజనాల సాధనపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా, నిధులు కేటాయింపులు లేవు, ఆడిగేవారే లేకుండా పోయారన్నారు.
 
కేసీఆర్ రాయలసీమ అభివృద్ధికి అడ్డుతగులుతూ ఎన్నో కేసులు వేశారన్నారు. ఇక్కడికి వచ్చి రాయలసీమను సశ్యశామలం చేస్తామంటే మెమేమన్నా చెవిలో పూలు పెట్టుకున్నామా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ నీకు చిత్తశుద్ధి ఉంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌పై కేస్‌లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చెప్పేదొకటి చేసేదొకటి, నీవెవరు రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి? ఒక పక్కా మాకు వ్యతిరేకంగా పని చేస్తున్నావు. 
 
4 లక్షల ఉద్యోగాలపై బాహాటంగా మా కార్యకర్తలకే అని విజయసాయి చెప్పారన్నారు. మరో పక్కా స్పీకర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఇది ప్రభుత్వమే లేక మీ సొంత సొమ్మా అని నిలదీశారు. గతంలో జన్మ భూమి కమిటీలకన్న దారుణంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

కాంట్రాక్ట్ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కేంద్రాలు అభద్రతా భావంలో ఉన్నారు, వారిని తీసేసి మీకిష్టమైన వాళ్ళను పెట్టుకోవడం ప్రజా వ్యతిరేకమన్నారు. కార్మికులని, రేషన్ డీలర్లను, బెదిరిస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదన్నారు. 4 లక్షల బదులు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, ఉన్న వాళ్ళని తీసివేయడం మంచిది కాదని, లేనిపక్షంలో ప్రత్యక్ష ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.