శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (18:16 IST)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘన స్వాగతం

కాంచీపురం అత్తి వరదరాజ స్వామి వారి దర్శననార్థం సోమవారం మధ్యాహ్నం 11.35 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిధున్ రెడ్డి, శాసన సభ్యులు సత్యవేడు ఆదిమూలం, పూతలపట్టు బాబు, శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన రెడ్డి, పలమనేరు వెంకటగౌడ, జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్తాలు స్వాగతం పలికారు.
 
వీరితో పాటు తిరుపతి అర్బన్ ఎస్.పి.అన్బు రాజన్, తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి, తహసీల్దార్ రేణిగుంట విజయసింహా రెడ్డి, రూరల్ కిరణ్ కుమార్, తెలంగాణ సి.ఎం.సెక్యూరిటీ ఆఫీసర్ ఎం.కె.సింగ్, ఎయిర్ పోర్టు డైరెక్టర్ సురేష్, సిఐ ఎస్ ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శుక్లా, ఆసిస్టెంట్ టర్మీనల్ మేనేజర్ శ్యామ్, డిటీలు  నాయకులు అభినయ్ రెడ్డి, మోహిత్ రెడ్డి, వల్లివేడు పృథ్వి రెడ్డి,పోకల అశోక్ కుమార్,డిటిలు శ్యామప్రసాద్, శివప్రసాద్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం రోడ్డు మార్గాన కాంచీపురం శ్రీఅత్తి వరదరాజ స్వామి వారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు.