గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 24 జూన్ 2021 (23:33 IST)

తెలంగాణా మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలి: సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ వివాదాల్లో ఉండే సిపిఐ నారాయణ ఈసారి తెలంగాణా మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలంటూ వ్యాఖ్యలు చేశారు. అసలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్థం ఎందుకని ప్రశ్నించారు.
 
నీటి యుద్ధం జరిగేలా మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి నాలుకను కోయాలన్నారు సిపిఐ నారాయణ. ప్రశాంత్ రెడ్డి ఒక్కరే కాదు ఎవరు ఈ మాట అన్నా సరే వారి నాలుక కోయాలన్నారు. ప్రస్తుతం నీటి యుద్ధం అవసరమా అని..కరోనా కష్టకాలంలో కూలంకుషంగా ఒకరినొకరు చర్చించుకోవాలే తప్ప ఈ మాటల యుద్ధం ఎందుకంటా మండిపడ్డారు. 
 
ప్రధానమంత్రి నరేంద్రమోడీపైన నిప్పులు చెరిగారు నారాయణ. ప్రపంచంలోనే మోడీ లాంటి అసమర్థ ప్రధాని లేడు అంటూ మండిపడ్డారు. దేశంలో రాజకీయ మార్పు రాబోతోందని జోస్యం చెప్పారు. థర్డ్ ఫ్రంట్ బలపడుతోందని..థర్డ్ ఫ్రం్ ను శరద్ పవార్ నడిపిస్తారని చెప్పారు.
 
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి ఓటమి ఖాయమని..కార్పొరేట్ సంస్ధలతో మోడీ లాలూచీ పడ్డారన్నారు. పెట్రోల్, డీజల్ ధరలను జిఎస్టీ పరిధిలోకి ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు. ఆర్.ఎస్.ఎస్.ను మించిన టెర్రరిస్టులు లేరంటూ విమర్సించారు. బిజెపిని ఎవరు ప్రశ్నించినా దేశద్రోహం, అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారన్నారు.